రాష్ట్రంలో శాంతి భద్రతలపై అఖిల పక్షంతో చర్చిద్దాం అని సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని.. తెలంగాణను కాపాడుకోవడానికి ఎలాంటి శశబిషలు లేకుండా ప్రగతి భవన్ కు స్వయంగా నేనే వస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లో పబ్, క్లబ్, డ్రగ్స్ వాడకం తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు, తమ…