Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో నియోజకవర్గం అంతటా నెలకొన్న రాజకీయ సందడికి తెరపడింది. అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు చివరి నిమిషం వరకు గెలుపు కోసం హోరాహోరీగా కృషి చేశారు. రోడ్డుషోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలతో నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై సర్వత్రా…