ఉదయం నుంచి ఎంతో హీట్ పుట్టించిన బీజేపీ ర్యాలీ కార్యక్రమం ముగిసింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో జాయింట్ సీపీ కార్తికేయకు చెప్పిన విధంగానే తాను కోవిడ్ నిబంధనల ప్రకారం నిరసన తెలియజేశారు. అయితే మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరకున్న జేపీ నడ్డా నివాళులు అర్పించి బీజేపీ నిరసన కార్యక్రమాన్ని ముగించారు. అయితే ఉదయం నుంచి బీజేపీ…
గత రెండు రోజులుగా తెలంగాణ బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే బండి సంజయ్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ నేడు సికింద్రాబాద్‌లోని మహత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిచేందుకు పిలుపు నిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఢిల్లీ నుంచి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జేపీ నడ్డాను ఆహ్వానించేందుకు కొందరినీ మాత్రమే ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించారు. అయితే అనుమతించిన…
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు.