ప్రముఖ హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2022 తర్వాత ఇక సినిమాలో నటించనంటూ ట్వీట్ చేశాడు. ‘ఈ యేడాదే చివరిది. ఇకపై సినిమాలు చేయను. నటనను నేను పట్టించుకోవడంలేదు, మీరూ పట్టించుకోకండీ’ అంటూ అతను చేసిన ట్వీట్ ఇప్పుడు రకరకాల చర్చలకు దారితీస్తోంది. రాహుల్ రామకృష్ణ శుక్రవారం రాత్రి పెట్టిన ఈ ట్వీట్ చూసి నెటిజన్లు కామెడీ చేయడం మొదలు పెట్టారు. ‘ఇది ఎన్నో రౌండ్?’ అని కొందరు అడుగుతుంటే, ‘వర్మలా ఓడ్కా…