Pawan Kalyan: ఏపీలో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా అంటూ ట్వి్ట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు. వర్తమాన విషయాలను పాత్రికేయులు ప్రజలకు అందించేందుకు నిబద్ధతతో పనిచేస్తారని.. వారిని అరెస్టులు చేసి కేసులు నమోదు చేసి కట్టడి చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని పవన్ ఆరోపించారు. జర్నలిస్టును అరెస్ట్ చేయడంలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించలేదన్నారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం…