ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌పై ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించాడు. రషీద్ కారణంగానే భారత్‌తో జరిగిన మూడో టీ20లో గెలిచామని చెప్పాడు. రషీద్ తమ జట్టులో ఉండటం అదృష్టం అని, వైవిధ్యంగా బంతులేయడం అతడి స్పెషాలిటీ అని పేర్కొన్నాడు. రషీద్, మార్క్ వుడ్ కలిసి ఇన్నింగ్స్ చివరలో విలువైన పరుగులు చేయడం కూడా కలిసొచ్చిందని బట్లర్ చెప్పుకొచ్చాడు. మంగళవారం రాత్రి భారత్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది.…