కర్నూలు జిల్లా, తుగ్గలి (మం) జొన్నగిరిలో వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడ కూలీలు, సామాన్య జనాలు ఒకటే హడావిడి. వజ్రాల వేటకు బయలుదేరతారు. తాజాగా కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. పొలం పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు దొరికిన రెండు వజ్రాలను వ్యాపారులు కొనేశారు. అది కూడా తక్కువ ధరకే అని తెలుస్తోంది. ఓ వజ్రాన్ని రూ.45 వేలకు, జత కమ్మలు ఇచ్చి కొన్నట్లు సమాచారం. మరొక వజ్రాన్ని రూ.35 వేలు ఇచ్చి కొనుగోలు చేశారు వ్యాపారులు.…