నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్ పరీక్ష 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2023 కోసం రిజిస్ట్రేషన్ డిసెంబర్ 15, 2022న ప్రారంభమవుతుంది. జనవరి 12, 2023న ముగుస్తుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్–2022 ఫలితాలను పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై ఆదివారం ప్రకటించింది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2022 (జేఈఈ మెయిన్స్ 2022) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు ప్రకటించింది. ర్యాంకులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆదివారం కేవలం ప్రొవిజనల్ ఫైనల్ కీ మాత్రమే విడుదల చేసిన ఎన్టీఏ ఇవాళ ర్యాంకులను ప్రకటించింది. జులై 25-30 మధ్య ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు వారి ఫలితాలను చూసుకోవచ్చు.