ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లను కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షతో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజస్థాన్‌లోని కోట శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.