జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేఎంఎం మాజీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీ గూటికి చేరారు. రాజధాని రాంచీలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో చంపై సోరెన్ బీజేపీలో చేరారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వార్ ఆప్‌కు గుడ్‌బై చెప్పారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కమలనాథులు.. కర్తార్ సింగ్ మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.