పార్టీలో చేరికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి ఎవరొచ్చినా.. రాజీనామా చేసే రావాలని తెలిపారు. నేతల వ్యక్తిత్వం ఆధారంగా పార్టీలో చేర్చుకునేది లేనిది.. నిర్ణయిస్తామని సీఎం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పార్టీలో చేరికలపై స్పందించారు. అభివృద్ధిని చూసి ఎన్డీఏ కూటమిలోకి వచ్చే వారికి ఆహ్వానం పలుకుతామని అన్నారు.