Yasin Malik: ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2006లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(LeT) చీఫ్, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కలిసిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పారని వెల్లడించారు.
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిషేధిత జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ తీహార్ జైలులో శుక్రవారం(జులై 22) నుంచి నిరాహార దీక్ష ప్రారంభించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఆయన కేసును సరైన రీతిలో విచారించడం లేదని ఆరోపిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు.