Pahalgam Attack: కశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి వెనుక కుట్ర నెమ్మదిగా బయటపడుతోంది. ఉగ్రవాదులతో నాలుగుసార్లు సమావేశమై, వారికి లాజిస్టికల్ మద్దతును అందించి, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లను సరఫరా చేసిన ఓ వ్యక్తిని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. నిందితుడి పేరు 26 ఏళ్ల మొహమ్మద్ యూసుఫ్ కటారి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రకారం.. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు సులేమాన్ అలియాస్ ఆసిఫ్, జిబ్రాన్, హంజా…