తెలంగాణలో సంచలనం కలిగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఏడుగురు నిందితులను నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది మేడ్చల్ కోర్టు. మరికొద్ది సేపట్లో నిందితులను కస్టడీకి తీసుకొని విచారణ చేయనున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. హత్య కుట్ర ఏ విధంగా ప్లాన్ చేశారు అనేదానిపై లోతైన దర్యాప్తు జరపనున్నారు. ఎనిమిది మంది నిందితులతో పాటు మిగిలిన వ్యక్తుల ప్రమేయం పై విచారణ సాగనుంది. ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్…