Game Of Thrones: హాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ లో ఒకటి గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ ఎండ్ అవుతుంది అని తెలిసి తెలుగు ప్రేక్షకులే ఎక్కువగా బాధపడ్డారు అంటే అతిశయోక్తి లేదు. జాన్ స్నో, మదర్ ఆఫ్ డ్రాగన్స్, స్టార్క్స్ ఫ్యామిలీ.. ఇలా అందులోని పాత్రలను అభిమానులు ఓన్ చేసుకున్నారు.