ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లు 2024తోసహా మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది.