China's Ex President Jiang Zemin Dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ బుధవారం 96 ఏళ్ల వయసులో షాంఘైలో కన్నుమూశారు. చైనాను ఆర్థిక శక్తిగా నిలబెట్టడంతో పాటు ప్రజా ఉద్యమాలను అత్యంత క్రూరంగా అణచివేసిన వ్యక్తిగా జియాంగ్‌కు పేరుంది. బుధవారం లుకేమియా, అవయవాల వైఫల్యంతో మరణించినట్లు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ( సీసీపీ) ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ‘‘కామ్రేడ్ జియాంగ్ జెమిన్ ఒక అద్భుతమైన నాయకుడు...…