వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని సీపీఎం మాజీ ఎమ్మెల్యే, రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోవాలని చూస్తే రైతులు చూస్తూ ఊరు కోరని వారి పక్షాన సీపీఎం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే కళ్లాల వద్ద ధాన్యం వానలకు తడిసి, ఎండలకు ఎండుతుందని మార్కెట్లలో మౌలిక…