ఉక్రెయిన్, రష్యా మధ్య దాదాపు నాలుగు నెలల నుంచి యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంతో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్ని రష్యా ఆక్రమించుకోగా, రష్యా సైనికుల్ని తిప్పికొట్టి కొన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకుంది ఉక్రెయిన్. అయితే, ఈ యుద్ధానికి తెరపడేదెప్పుడు? ప్రస్తుత పరిణామాల్ని బట్టి చూస్తుంటే, ఈ యుద్ధం సుదీర్ఘకాలం పాటు సాగేలా ఉంది. ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.…