బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఈరోజు, రేపు బీహార్‌లో పర్యటించనున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ప్రధాని మోడీ సోమవారం బీహార్‌లోని పూర్ణియాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీహార్‌లో ఎన్నికల వార్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నేతలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. ఇక నవంబర్ కల్లా బీహార్ ఎన్నికలు ముగించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బెదిరించేందుకే కేంద్రం తొలగింపు బిల్లు తీసుకొచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి మధ్య హోరాహోరీ ఫైటింగ్ సాగేలా ఉంది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుంటే... ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇలా ఇరు పక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
Chirag Paswan: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఎన్డీయేలోని మిత్రపక్షాలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల, బీహార్ వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించిన సంఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా, అంబులెన్స్‌లో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన బీహార్ రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, సీఎం నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం…
జగదీప్ ధన్ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవి ఉండగానే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో వైదొలగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ధన్ఖర్ పేర్కొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ నితీష్ కుమార్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.