టాలీవుడ్ మాచో మ్యాన్ గోపీచంద్ పుట్టినరోజుని పురస్కరించుకొని, కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఇంతకుముందు శంఖం, గౌతమ్ నంద సినిమాలకు కలిపి పని చేసిన జే. భగవాన్, జే పుల్లారావుల నిర్మాణంలో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. ఈ నిర్మాతలు కొత్తగా జేబీ ఎంటర్టైన్‌మెంట్స్ (జడ్డు బ్రదర్స్ ఎంటర్టైన్మెంట్స్) అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఇదివరకే ఈ బ్యానర్‌పై ఓ సినిమా నిర్మించిన వీళ్లు.. ఇప్పుడు గోపీచంద్ రెండో చిత్రాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో ‘ప్రొడక్షన్ నం.2’గా ప్రాజెక్ట్‌ని…