టాలీవుడ్ మాచో మ్యాన్ గోపీచంద్ పుట్టినరోజుని పురస్కరించుకొని, కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఇంతకుముందు శంఖం, గౌతమ్ నంద సినిమాలకు కలిపి పని చేసిన జే. భగవాన్, జే పుల్లారావుల నిర్మాణంలో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. ఈ నిర్మాతలు కొత్తగా జేబీ ఎంటర్టైన్‌మెంట్స్ (జడ్డు బ్రదర్స్ ఎంటర్టైన్మెంట్స్) అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఇదివరకే ఈ బ్యానర్‌పై ఓ సినిమా నిర్మించిన వీళ్లు.. ఇప్పుడు గోపీచంద్ రెండో చిత్రాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో ‘ప్రొడక్షన్ నం.2’గా ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు.
ఈ సినిమాను ఓ మాస్ దర్శకుడు తెరకెక్కించనున్నాడని కూడా తెలిపారు కానీ, అతనెవరన్నది రివీల్ చేయలేదు. త్వరలోనే ఆ దర్శకుడి పేరుని ప్రకటిస్తామని సస్పెన్స్‌లో పెట్టేశారు. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. ఆ దర్శకుడు సంపత్ నంది అయ్యుండొచ్చని చెప్తున్నారు. అయితే, దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ముగిసిన తర్వాత, గోపీచంద్ ఈ కొత్త ప్రాజెక్ట్‌ని ప్రారంభించనున్నాడు. అంటే, ఇది సెట్స్ మీదకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందన్నమాట! గోపీచంద్ ఇమేజ్‌కి తగినట్టుగానే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు వార్తలొస్తున్నాయి.
కాగా.. ప్రెజెంట్ గోపీచంద్ తన ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. ప్రోమోలన్నీ ఆసక్తికరంగా ఉండటం, మారుతికి మంచి ట్రాక్ రికార్డ్ ఉండటం, ప్రొడక్షన్ హౌస్ కూడా పేరుగాంచిందే కావడంతో.. ‘పక్కా కమర్షియల్’పై మంచి అంచనాలే ఉన్నాయి.
Wishing A very very Happy Birthday to our Machostar @YoursGopichand garu 🎂. Wishing you have a successful year ahead 💐! #HappyBirthdayGopichand #HBDGopichand #JBhagavan @j_pullarao pic.twitter.com/K3KZ58fTZ1
— JB Entertainments (@JBEnt_Offl) June 12, 2022