తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు జయశంకర్ అని ఆయన అన్నారు