పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ “జయమ్మ పంచాయితీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రైలర్ బాగుందంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించిన పవన్, సినిమా హిట్ కావాలని కోరుకుంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్రైలర్ లో భర్త అనారోగ్యం పాలయ్యేంత వరకు సంతోషకరమైన జీవితాన్ని గడిపే సాధారణ గృహిణిగా కన్పించింది…