తెలుగు వారు ఎక్కడికి వెళ్లిన రాణిస్తున్నారు. తమ ప్రతిభను కనబరిచి అగ్ర రాజ్యంలో సైతం గౌరవమైన పదవులను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాదిగ నియమితులయ్యారు.