ఉత్తరాంధ్రలో జవాద్ తుపాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని.. ఒక్క మరణం కూడా సంభవించొద్దని పేర్కొన్నారు. ఆ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని… సహాయ చర్యల్లో…