తన హృదయంలో కేప్‌టౌన్ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. టెస్ట్ మ్యాచ్ ఇంత తొందరగా ముగుస్తుందని తాను ఊహించలేదని, టెస్టు క్రికెట్ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుందన్నాడు. విదేశీ పరిస్థితుల్లో రాణించాలంటే నిలకడగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని బుమ్రా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా (6/61) ప్రొటీస్ జట్టు పతనాన్ని శాసించాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు…