రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పెద్ది’ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, నిర్మాత వెంకట సతీశ్ కిలారు.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం గురువారం నుంచి అంటే ఈ రోజు నుంచి పుణెలో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతోంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, జాన్వీ కపూర్‌పై ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు.…