జనగామ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో పనిచేస్తేనే తెలంగాణలో ఇదంతా సాధ్యమయ్యిందని ఆయన అన్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదని ఆయన అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణలో కరెంట్ పోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 7 గ్రామాలు…