Kota Srinivasa Rao : కోట శ్రీనివాస రావు మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోట జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం ఒకే ఒక్క డైరెక్టర్. ఆయన చేయించిన పాత్రతోనే కోటకు ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు వచ్చింది. ఆయనే జంధ్యాల. కోట 1978లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ప్రాణం ఖరీదు సినిమాలో చిన్న పాత్ర చేశారు. దాని తర్వాత…
తెలుగు లెజెండరీ సినీ డైరెక్టర్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు కె. రాఘవేంద్రరావు. అనేక వైవిధ్యభరితమైన సినిమాలు రూపొందించిన ఆయన, ఎంతోమందని స్టార్ హీరోలుగా చేయడంతో పాటు, ఇంకెంతో మందికి నటన నేర్పించి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారు ఇప్పటికి సినీ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. రాజమౌళి వంటి డైరెక్టర్‌ను సినీ పరిశ్రమకు అందించిన ఘనత కూడా రాఘవేంద్రరావుదే. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడం లేదు కానీ, పలు…
తెలుగు చలన చిత్రసీమలో పలు అరుదైన రికార్డులు నమోదు చేసిన ఘనత నటరత్న యన్.టి.రామారావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ కే దక్కుతుంది. యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తొలిసారి తెరకెక్కించిన చిత్రం ‘అడవిరాముడు’. ఈ చిత్రంలో అనుసరించిన ఫార్ములాను ఇప్పటికీ తెలుగు సినిమా అనుసరిస్తూనే ఉండడం విశేషం! దర్శకత్వంలో రాణించాలనుకొనేవారికి పూర్తిగా అడవిలో రూపొందిన ‘అడవిరాముడు’ చిత్రం ఓ అధ్యయన అంశమనే చెప్పవచ్చు. ఈ చిత్రం విడుదలై నలభై ఐదేళ్ళు అవుతున్నా, ఇంకా ‘అడవిరాముడు’ ఫార్ములానే అనుసరిస్తున్నవారెందరో ఉన్నారు.…
“నవ్వడం యోగం… నవ్వించడం భోగం… నవ్వకపోవడం రోగం…” అంటూ ఓ నవ్వుల సూత్రాన్ని జనానికి పరిచయం చేశారు జంధ్యాల. ఇంటిపేరుతోనే రచయితలుగా ఎందరో వెలుగులు పంచారు. వారిలో పసందైన పదాలు పరిచయం చేసిన వారు ఎందరో. అలాంటి వారిలో జంధ్యాల పేరు వినగానె తెలుగుజనానికి కితకితలు పెట్టినట్టు ఉంటుంది. ఒకటా రెండా మరి, జంధ్యాల రచనలో జాలువారిన పదాలయితేనేమి, ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాల విందులయితేనేమి అన్నీ మనకు హాయిగా నవ్వుకొనే వీలు కల్పిస్తాయి. జంధ్యాల అన్నది…
(సెప్టెంబర్ 11తో ‘ముద్దమందారం’కు 40 ఏళ్ళు) మాటల రచయితగా పలు పదవిన్యాసాలతో ఆకట్టుకున్నారు జంధ్యాల. “అడవిరాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు” వంటి కమర్షియల్ హిట్స్ కు సంభాషణలు పలికించి జనానికి సంతోషం పంచిన జంధ్యాల ‘సిరిసిరిమువ్వ, శంకరాభరణం’వంటి కళాత్మక చిత్రాలకూ పండితపామరుల ఆకట్టుకొనే రచన చేశారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాసి, నటించి, దర్శకత్వం వహించిన జంధ్యాల మనసు సినిమాకు దర్శకత్వం వహించాలని కోరుకుంది. తత్ఫలితంగానే ‘ముద్దమందారం’ చిత్రం రూపొందింది. తాను తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం…
(ఆగస్టు 22న ‘చంటబ్బాయ్’ 35 ఏళ్ళు పూర్తి) మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆయన పుట్టినరోజయిన ఆగస్టు 22న విడుదలైన ఏకైక చిత్రం ‘చంటబ్బాయ్’. జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఒకే ఒక్క చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘చంటబ్బాయ్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతం హాస్యంతో సాగే ఈ సినిమాలో చివరలో…