ప్రశ్నించేందుకే జనాల్లోకి వచ్చిన పార్టీ జనసేన అని ఆ పార్టీ అధినత పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఓ సారి ఆ హద్దును దాటి.. అధికారం దిశగానూ ప్రయత్నించారు. కానీ.. ఎన్నికల పోరులో చతికిలబడి.. శాసనసభలో ఒకే స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత సందర్భానుసారంగా జనాల్లోకి వెళ్తూ.. ప్రజా సమస్యలపై పోరాటాన్ని చేస్తున్నారు. అవి పార్టీకి ఎంత వరకూ మైలేజ్ ఇస్తున్నాయన్నదే.. శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ బలం, బలగం ముందు..…