ముఖ్యమంత్రి వైయస్.జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్రకు ఇవ్వాళ్టితో (శనివారం) నాలు గేళ్లు పూర్తిచేసుకుంది. ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్సార్ సమాధివద్ద 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ…