కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహిస్తున్న సభకు బీఆర్ఎస్ ఆటంకాలు సృష్టిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామనే భయంతో మా సభను ప్రభుత్వం అడ్డుకుంటోంది అని ఆమె సీరియస్ అయ్యారు. రోడ్లపై బారికేడ్లు పెడితే భయపడతామా? మా జాతకాల్లో భయాల్లేవు.. ఎవడబ్బ సొమ్మని పెడుతున్నారు..? పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దు.. ఎవడ్రా మమ్మల్ని ఆపేది? అని రేణుకచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.