జననాయగన్ ఫక్తు దళపతి విజయ్ సినిమా అంటూ మొన్నటి వరకు ఊదరగొట్టాడు దర్శకుడు హెచ్ వినోద్. ట్రైలర్ వచ్చాక అసలు స్వరూపం బయటపడింది. భగవంత్ కేసరికి కాపీ పేస్ట్ అంటూ విమర్శలొచ్చాయి. బాలకృష్ణను విజయ్ మ్యాచ్ చేయలేకపోతున్నాడని ఆల్రెడీ ఈ మూవీని వాచ్ చేసిన వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసమేనా కెవిన్ ప్రొడక్షన్ హౌస్ రూ. 380 కోట్లు ఖర్చుపెట్టింది అంటూ చర్చించుకుంటున్నారు. ఇదే కాదు.. విజయ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా మారింది.…