Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saunf Sharbat : మే, జూన్ నెలలు వచ్చాయంటే చాలు… బయట అడుగు పెట్టాలంటేనే భయం వేసేంతగా ఎండలు మండిపోతుంటాయి. ఈ కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం కేవలం సౌకర్యం కోసం కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా అవసరం. వడగాలులు, డీహైడ్రేషన్, ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వేడి తీవ్రత పెరిగే కొద్దీ ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో మన పెద్దలు తరతరాలుగా ఉపయోగిస్తున్న కొన్ని పానీయాలు, ఉపశమనం కోసం మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. అలాంటి వాటిలో సోంపు షర్బత్ ఒకటి.
ఆయుర్వేదంలో సోంపుకు ప్రత్యేక స్థానం ఉంది. సహజంగా శరీరానికి చల్లదనాన్ని అందించే గుణాలు ఇందులో ఉంటాయని భావిస్తారు. ముఖ్యంగా వేసవిలో కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువయ్యే సమయంలో సోంపుతో తయారుచేసిన పానీయాలు ఉపశమనాన్ని అందించగలవని నిపుణులు చెబుతున్నారు. పుదీనా, పటిక బెల్లం, నిమ్మరసం వంటి పదార్థాలతో కలిపి తయారుచేసే సోంపు షర్బత్ శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా దాహాన్ని కూడా తగ్గిస్తుంది.
Also Read
- Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ "దద్దోజనం" కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
- How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
ఈ షర్బత్ తయారీకి అర కప్పు లావుగా ఉన్న సోంపు గింజలు, అర కప్పు పటిక బెల్లం, ఒక టీస్పూన్ నల్ల ఉప్పు, ఒక టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, నాలుగు గ్లాసుల చల్లటి మట్టి కుండలోని నీరు అవసరం. ముందుగా సోంపు గింజలను శుభ్రంగా కడిగి ఒక కప్పు నీటిలో కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టాలి. సమయం తక్కువగా ఉంటే గోరువెచ్చని నీటిలో సుమారు నలభై ఐదు నిమిషాలు నానబెట్టినా సరిపోతుంది.
ఆ తర్వాత పటిక బెల్లాన్ని మెత్తగా పొడి చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. నానిన సోంపును కొద్దిగా పుదీనాతో కలిపి మెత్తగా రుబ్బి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని జల్లెడ సహాయంతో వడకట్టి అందులోని సారాన్ని పూర్తిగా తీసుకోవాలి. తరువాత పటిక బెల్లం పొడి, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చివరగా చల్లటి నీటిని జోడించి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి.
వడ్డించే సమయంలో గ్లాసులో కొన్ని ఐస్ ముక్కలు వేసి ఈ షర్బత్‌ను పోసి పుదీనా ఆకులతో అలంకరిస్తే మరింత రుచిగా ఉంటుంది. మామూలు శీతల పానీయాల కంటే సహజమైన ఈ పానీయం శరీరానికి హాయిని అందించడమే కాకుండా వేసవి వేడిని తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది. ముఖ్యంగా బయట నుంచి ఎండలో వచ్చాక లేదా వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ షర్బత్‌ను తీసుకోవడం వల్ల శరీరం తాజాగా అనిపిస్తుంది.
ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే అనేక కూల్ డ్రింక్స్ మధ్య మన సంప్రదాయ భారతీయ పానీయాల విలువను చాలామంది మరిచిపోతున్నారు. అయితే ఇంట్లోనే తయారయ్యే సోంపు షర్బత్ వంటి పానీయాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా వేసవి కాలంలో శరీరాన్ని సమతుల్యంలో ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మండే ఎండల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజువారీ ఆహారంలో ఇలాంటి సహజ పానీయాలకు స్థానం కల్పించడం మంచి అలవాటుగా నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!