సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లెంపాడులో భేటీ అయ్యారు. అయితే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత రేవంత్ రెడ్డి భట్టి పాదయాత్రలో కలవడం ఇదే మొదటిసారి. జులై 2న జరగబోయే తెలంగాణ జన గర్జన సభ సన్నాహక సమావేశం గురించి చర్చించారు.