హిమాలయాల్లో కొలువైన అమర్‌నాథ్ ఆలయ యాత్ర జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31, 2023న ముగుస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు మోడ్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.
బాపూజీ మహాత్మాగాంధీపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ ఎలాంటి డిగ్రీలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం గ్వాలియర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.