జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటన దోడా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యు టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. బుధవారం ఉదయం బస్సు 40 మంది ప్రయాణికులతో కిష్త్వార్ నుంచి జమ్మూ…