కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీ “జేమ్స్” విడుదలకు సిద్ధమవుతోంది. పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు పునీత్ లేకపోవడంతో ఆయన పాత్ర డబ్బింగ్ విషయం ఆసక్తికరంగా మారింది. పునీత్ డబ్బింగ్ మినహా సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. పునీత్‌కి డబ్బింగ్ చెప్పడానికి తగిన వాయిస్ కోసం మేకర్స్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. చివరకు పునీత్ అన్నయ్య శివరాజ్‌కుమార్‌తో డబ్బింగ్ చెప్పించడానికి మొగ్గు చూపారు.…