Jallikattu: తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం అనుపల్లిలో కాసేపట్లో జల్లికట్టు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు తమిళనాడు నుంచి కూడా వందలాది కోడె గిత్తలు తరలి వచ్చాయి. పశువుల మెడపై కట్టిన బహుమతులను సొంతం చేసుకునేందుకు యువకులు భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారు.