(ఆగస్టు 9న జాలాది జయంతి) తన పూర్వ గీత రచయితల బాణీలోనే సాగుతూ, తనదైన ముద్రను వేశారు ప్రముఖ పాటల రచయిత జాలాది రాజారావు. రాశి కన్నా వాసి మిన్న అన్న తీరున జాలాది పాటలు మురిపించాయి. వందలాది చిత్రాల్లో ఆయన పాట తన ఉనికిని చాటుకుంది. జానపదం పలికించగలరు, సాహిత్యం కురిపించగలరు, చైతన్య గీతాలనూ జ్వలింప చేయగలరు. ఏది చేసినా అందులో జాలాది బాణీ ప్రస్ఫుటంగా కనిపించేది. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆయన రాసిన కవితల…