వైద్య వృత్తి.. ఇది పవిత్రమైన వృత్తి. అందరూ చేతులెత్తి దండం పెట్టే వృత్తి. సమాజంలో వైద్య వృత్తికి అంత గౌరవం ఉంటుంది. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న వైద్యులు.. ఉగ్రవాదులుగా మారడం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా ఢిల్లీ పేలుడు తర్వాత వెలుగులోకి వస్తున్న సంఘటలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి.