కోవిడ్ కేసులు పెరగడంతో స్కూళ్లకు సెలవులిచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంతకీ కరోనా విజృంభిస్తే స్కూళ్లు మూసేయాలా? ప్రపంచ బ్యాంక్ విద్యారంగం డైరెక్టర్ జేమీ సావెద్రా దీనిపై పరిశోధన చేశారు. విద్యా వ్యవస్థపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా కారణంగా నెలలపాటు పాఠశాలలు మూతబడ్డాయి. ఇప్పటికీ పలు దేశాల్లో విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు హాజరుకాలేకపోతున్నారు. అయితే, ఈ కారణంగా పాఠశాలలను మూసివేయడాన్ని ప్రపంచబ్యాంకు సమర్థించుకోలేమంటోంది. విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం…