దేశరాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీ జహంగీర్ పురలో 144 సెక్షన్ అమలులో వుంది. భారీగా రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. నిన్న హనుమాన్ శోభయాత్రలో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు పోలీసులు. నిన్నటి ఘటనలో గాయపడ్డ 9 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. రాళ్ళు రువ్విన ఘటనలో పోలీసులతో పాటు పౌరులు…