తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మానవత్వపు విలువలు మరచి, ఆస్తి కోసం సొంత బంధాన్నే అడ్డుకున్నాడు ఓ వ్యక్తి. ఆస్తికోసం దత్తపుత్రుడి హక్కును సొంత సోదరుడు అడ్డుకున్నాడు. అంత్యక్రియలు నిర్వహించే హక్కుపై ఆస్తి వివాదం కారణంగా దత్తపుత్రుడిని అతని సొంత సోదరుడే అడ్డుకోవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. చివరకు ఆస్తిలో వాటా కోసం పట్టుబట్టిన దత్తపుత్రుడి సోదరుడు.. అంత్యక్రియలను పూర్తి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… జగిత్యాల పట్టణంలోని ఉప్పరిపేటలో గత రాత్రి…
MLC Kavitha : జగిత్యాలలో జరిగిన దారుణ ఘటనపై తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో గోడు చెప్పుకోవడానికి వచ్చిన ఓ దివ్యాంగుడిని, కలెక్టర్ ఎదుటే కానిస్టేబుల్ ఈడ్చి, అతని వీల్‌చైర్ నుంచి కింద పడేసి లాక్కెళ్లిన ఘటనపై ఆమె స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎమ్మెల్సీ కవిత ఈ సంఘటనను “ప్రజాపాలన అంటే ఇదేనా?” అని ప్రశ్నిస్తూ, దీనిని అత్యంత దుర్మార్గమైన చర్యగా ఖండించారు. బాధ్యుడైన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు…
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని తల్లిదండ్రులు జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది.