తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరతానే ప్రచారం ఊపందుకుంది. పార్టీ అధిష్టానం తీరుపై ఆయన అసహనం వెళ్ళగక్కుతున్న సంగతి తెలిసిందే. తనను కోవర్ట్ అంటూ రేవంత్ రెడ్డి అనుచరులే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడవద్దని జగ్గారెడ్డి భావించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా…