ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారుడిని కన్న తండ్రే కడతేర్చాడు. సోమవారం రాత్రి జరిగిన కొట్లాటలో కసాయి కొడుకుని తండ్రి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… Also Read: AP BJP President: ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన! గోళ్ల వెంకటనారాయణ…
వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి వర్రా రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మెడ నొప్పి, నడుముల నెప్పి వల్లన కడప సెంట్రల్ జైలుకు పంపించాలని వర్రా కోరారు. అయితే జగ్గయ్యపేట సబ్ జైల్లో అవసరమైన ఏర్పాట్లు, చికిత్స అందించాలని పోలీసులకు మెజిస్ట్రేట్ తెలిపింది. మెజిస్ట్రేట్ ఆదేశాలకే జగ్గయ్యపేట సబ్ జైల్ అధికారులు ఓకే చెప్పారు. అనంతరం జగ్గయ్యపేట సబ్ జైలుకు వర్రా రవీందర్ రెడ్డిని తరలించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్…
కుక్కల మారణహోమానికి మరో బాలుడు బలైపోయాడు. కుక్కల స్వైరవిహారానికి ప్రాణాలు పోతున్నా.. అధికారుల మాత్రం పట్టించుకోవడంలో లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయి.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. ఆరు రోజులుగా డయేరియా కేసులు ప్రభుత్వాస్పత్రికి వస్తూనే ఉన్నాయి. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు వాంతులు, విరేచనాలతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ప్రస్తుతం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు పేషేంట్లకు విజయవాడలో చికిత్స అందిస్తున్నారు. కొంత మందికి పరిస్థితి సాధారణమై డిశ్చార్జ్ అయ్యారు.