తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగుజాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని తిరుమల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దీంతో ఏపీ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై తిరుమలలో దర్శనంకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న…