Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada vs Bosnia: ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup 2026)లో సహ-ఆతిథ్య దేశమైన కెనడా తన గ్రూప్-B తొలి మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినాతో 1-1 తేడాతో డ్రా చేసుకుంది. టొరంటోలోని బీఎంఓ ఫీల్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా సేపు సమయం ఆధిపత్యం చెలాయించిన కెనడా.. చివరి దశలో సైల్ లారిన్ గోల్‌తో ఓటమి నుంచి తప్పించుకుంది.
మ్యాచ్ ఆరంభంలో కెనడా దూకుడుగా ఆడుతూ అభిమానుల మద్దతుతో ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే 21వ నిమిషంలో బోస్నియా కార్నర్ కిక్‌ను సద్వినియోగం చేసుకుంది. ఇవాన్ బాసిక్ అందించిన బంతిని సియాద్ కొలాసినాక్ హెడ్‌తో గోల్ ముందుకు మళ్లించగా.. జోవో లుకిచ్ సమీపం నుంచి గోల్ చేసి బోస్నియాకు ఆధిక్యం అందించాడు. అంతర్జాతీయ కెరీర్లో అతనికి ఇది తొలి గోల్.
Also Read
- CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే అంతే..
- Malakpet Deer Meat: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
- Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
- AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
ఆ గోల్ తర్వాత బోస్నియా రక్షణాత్మక వ్యూహాన్ని అవలంబించింది. ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడంతో కెనడా గోల్ అవకాశాలను మాత్రం సృష్టించడంలో ఇబ్బంది పడింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి బోస్నియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో కెనడా మరింత దూకుడుగా ఆడింది. 53వ నిమిషంలో స్టీఫెన్ యూస్టాక్వియో ఇచ్చిన అద్భుత పాస్‌తో రిచీ లారియా గోల్ చేసే అవకాశాన్ని పొందాడు. గోల్కీపర్ను దాటిన తర్వాత అతని షాట్ గోల్‌గా మారేలా కనిపించినా, కొలాసినాక్ అద్భుతంగా అడ్డుకొని బంతిని క్రాస్‌బార్‌కు తాకేలా చేశాడు. ఇక మరోవైపు బోస్నియా కూడా కౌంటర్ అటాక్‌లతో ప్రమాదకరంగా కనిపించింది. ఎర్మెడిన్ డెమిరోవిచ్కు వచ్చిన అవకాశాన్ని కెనడా గోల్‌కీపర్ మాక్సిమ్ క్రెపో అద్భుతంగా అడ్డుకొని జట్టును కాపాడాడు.
మ్యాచ్ ముగింపుకు చేరుకుంటున్న సమయంలో కెనడా కోచ్ జెస్సీ మార్ష్ తీసుకున్న నిర్ణయం ఫలితాన్ని మార్చింది. 76వ నిమిషంలో మైదానంలోకి వచ్చిన స్టార్ స్ట్రైకర్ సైల్ లారిన్ కేవలం రెండు నిమిషాల్లోనే ప్రభావం చూపాడు. ప్రామిస్ డేవిడ్ ఇచ్చిన పాస్ ను అందుకున్న లారిన్ అద్భుత టర్న్‌తో డిఫెండర్లను తప్పించుకుని 78వ నిమిషంలో బంతిని గోల్‌పోస్ట్ లోకి పంపించాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. అదనపు సమయంలో కూడా లారిన్ మరోసారి గోల్‌కు చేరువయ్యాడు. అయితే తారిక్ ముహరేమోవిచ్ చివరి క్షణంలో అతని ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో బోస్నియా ఓటమి నుంచి తప్పించుకుంది.
గాయంతో కెప్టెన్‌ను కోల్పోయినప్పటికీ కెనడా ఈ మ్యాచ్‌లో మంచి ఆటతీరును కనబరిచింది. ఎక్కువసేపు ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడం, వరుస అవకాశాలు సృష్టించడం జట్టుకు సానుకూల అంశాలుగా కనిపించాయి. అయితే వాటిని గోల్స్‌గా మలచలేకపోవడం వల్ల విజయం చేజారింది. మరోవైపు 2014 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న బోస్నియా అండ్ హెర్జెగోవినా క్రమశిక్షణతో కూడిన ఆటతీరును ప్రదర్శించింది. చివరికి ఇరు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నా.. బోస్నియా ఈ ఫలితంతో సంతృప్తి చెందగా, కెనడా మాత్రం రెండు పాయింట్లు చేజార్చుకున్నామనే భావనతో మైదానం వీడింది.
It all ends level! 🤝#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 12, 2026
తాజావార్తలు
-
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే అంతే..
-
Malakpet Deer Meat: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
-
Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!