విద్యార్థులకు, వారి తల్లులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు జగనన్న వసతి దీవెన విడుదల చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేయనున్నారు సీఎం జగన్.. అనంతపురం జిల్లా నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.